బలగం టివి, రాజన్న సిరిసిల్ల
_ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(USPC) రాజన్న సిరిసిల్ల జిల్లా.
నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని,
రైతులకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని,
విద్యుత్ చట్ట సవరణను రద్దు చేయాలని,
ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను, అమ్మకాన్ని నిలిపివేయాలని మరియు
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా
ఈ నెల 16 న కేంద్ర కార్మిక సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు, గ్రామీణ భారత్ బంద్ కు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పిసి), రాజన్న సిరిసిల్ల జిల్లా తరపున సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాము.
కేంద్రప్రభుత్వ విధానాలతో కార్మికులు, రైతులు, సాధారణ ప్రజలతోపాటు మధ్యతరగతి ఉద్యోగులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు లేవు,
ఉద్యోగ భద్రత లేదు.
ఏళ్ళ తరబడి కాంట్రాక్ట్,
ఔట్ సోర్సింగ్ పద్దతిలో కొనసాగిస్తున్నారు.
గత పదేళ్ళలో ఆదాయపన్ను స్లాబులను సవరించలేదు, రాయితీ మొత్తాన్ని పెంచలేదు. అన్ని వస్తువులపై జిఎస్టీ వసూలు చేస్తూ వేతన జీవులపై ఆదాయపన్ను భారాన్ని అధికంగా మోపి, కార్పొరేట్లకు మాత్రం పన్నుల్లో రాయితీలు కల్పించారు.
రాష్ట్ర యు ఎస్ పి సి ఇచ్చిన పిలుపుమేరకు రైతులు, కార్మికుల సమస్యలతో పాటు ఆదాయపన్ను శ్లాబులు సవరించాలని, రాయితీ పరిమితిని పెంచాలని, CPS & PFRDA లను రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్దరించాలని, NEP -2020 ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ…
సార్వత్రిక సమ్మె, గ్రామీణ భారత్ బందుకు మద్దతుగా ఈరోజు సాయంత్రం ఉపాధ్యాయులు సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాజన్న సిరిసిల్ల జిల్లా యూఎస్పిసి ఆధ్వర్యంలో
నిరసన ప్రదర్శనలు నిర్వహించి, రైతులు, కార్మికులు నిర్వహించే సార్వత్రిక సమ్మెకు సంఘీభావం తెలపడం జరిగింది. అదేవిధంగా రేపు నల్ల బ్యాడ్జీలతో నిరసనను తెలియజేయడం జరుగుతుంది.
ఈరోజు జరిగిన సంఘీభావ ప్రదర్శనలో యూఎస్పిసి భాగస్వామ్య సంఘాల బాధ్యులు దోర్నాల భూపాల్ రెడ్డి, దొంతుల శ్రీహరి, దుమాల రమానాధ్ రెడ్డి, అవురం సుధాకర్ రెడ్డి, ఉత్తమ్ విజయ్ కుమార్, మల్ల్లారపు పురుషోత్తం, మరెల్లి విష్ణుప్రసద్ అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.