బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లాకు పూర్తిస్థాయి జిల్లా కలెక్టర్‌గా 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి గరీమా అగ్రవాల్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా విధులు నిర్వహిస్తున్న ఆమె, గత కొంతకాలంగా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో పరిపాలనా వ్యవస్థపై మంచి పట్టు సాధించిన ఆమెను ప్రభుత్వం పూర్తిస్థాయి కలెక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
