బలగం టీవి , సిరిసిల్ల
ఈ రోజు సిరిసిల్ల పద్మశాలి సంఘం కార్యాలయంలో పద్మశాలి యువజన సంఘం యొక్క సాధారణ సమావేశాన్ని అధ్యక్షులు గుండ్లపెల్లి పూర్ణచందర్ ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు గుండ్లపెల్లి పూర్ణచందర్ మరియు ప్రధాన కార్యదర్శి గెంట్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ పద్మశాలి యువజన సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం కోసం సంఘం యొక్క నూతన సభ్యత్వాలు నమోదు చేయాలని నిర్ణయించడం జరిగిందని తెలియచేశారు.
ఇందు కోసం పట్టణంలో ఉన్నటువంటి పద్మశాలి యువకులు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క పద్మశాలి యువకుడు ఇట్టి సభ్యత నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతూ నూతన సభ్యత్వ రుసుమును రూ.250/- గా మరియు ఇదివరకే సభ్యత్వం ఉన్నటువంటి ప్రస్తుతం 35 సం.ల లోపు ఉన్నట్లయితే వారు రూ.150/- చెల్లించి వారి సభ్యత్వాన్ని రెన్యువల్ చేయించుకోవాలని తెలియ చేయడం జరిగింది.
సభ్యత్వం చేసుకొనదలచిన వారు వారి యొక్క రెండు ఫోటోలు మరియు ఆధార్ కార్డు జిరాక్స్ దరఖాస్తు ఫారం వెంట జతపరచవలసిందిగా కోరడమైనది. అన్ని నియమాలు పద్మశాలి యువజన సంఘం యొక్క నియమ నిబంధనలకు లోబడి ఉండగలవు.
కావున అర్హులైన ప్రతి ఒక్క పద్మశాలి యువకులు సభ్యత్వ నమోదులో పాల్గొని సంఘ బలోపేతం కొరకు పాటుపడవల్సిందిగా కోరుతున్నామని తెలిపారు.
ఇట్టి సభ్యత్వ నమోదు కార్యక్రమం తేదీ: 15-02-2024 నుండి 01-03-2024 వరకు మార్కండేయ వీధిలో గల పద్మశాలి సంఘ కార్యాలయంలో చేపట్టడం జరుగుతుందని ప్రతి పద్మశాలి యువకుడు ఇట్టి సభ్యత్వ నమోదు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరినారు.
ఇట్టి సమావేశంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి వెంకటరమణ , ప్రధాన కార్యదర్శి మండల సత్యం , పద్మశాలి యవజన సంఘం ప్రధాన కార్యదర్శి గెంట్యాల శ్రీనివాస్ , సాంస్కృతిక కార్యదర్శి వేముల ప్రకాష్ , కార్యనిర్వాహక కార్యదర్శి వాసం శివశంకర్ మరియు వార్డు డైరెక్టర్లు పాల్గొన్నారు.