బలగం టీవి, ,రాజన్న సిరిసిల్ల
- ప్రభుత్వ విప్,
వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ - సిరిసిల్ల పట్టణం గీతానగర్ లోని ప్రభుత్వ
ఉన్నత పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవం
– ఆకట్టుకున్న విద్యార్థినుల ప్రదర్శనలు
బాలురతో దీటుగా బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని,
ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణం గీతానగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అవరణలో బుధవారం జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం ఆధ్వర్యంలో
వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతి నిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడారు. బాలికలు, మహిళల అభివృద్ధికి నిధులు, ప్రత్యేక పథకాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వస్తుందని తెలిపారు. బాలికలు ఉన్నత చదువులు అభ్యసించి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. టీచర్ లు, శాస్త్రవేత్తలు, ఐ ఏఎస్, ఐపీఎస్ లు కావాలని ఆకాంక్షించారు విద్యార్ధినులకు టీచర్ లు, కుటుంబ సభ్యులు మద్దతుగా ఉండాలని వివరించారు. గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన రాజ్యాంగ సవరణలతో విద్య, రాజకీయ రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని గుర్తు చేశారు. ఇంట్లో పెద్దలు చెప్పిన సూచనలను పిల్లలు తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. మహిళలతో ఇంటికి అందం వస్తుందని, వారిని అందరం గౌరవిద్దామని పిలుపు నిచ్చారు. అనంతరం స్కూల్ ఆవరణలోని విద్యార్థులకు చాక్లెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పూజారి గౌతమి మాట్లాడారు. విద్యార్థినులు గొప్ప ఆశయంతో చదవాలని పిలుపునిచ్చారు. బాలికలకు హక్కులు, రక్షణలపై టీచర్స్, కుటుంబ సభ్యులు, అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. విద్యతోనే మార్పు సాధ్యమని స్పష్టం చేశారు. చిన్నప్పటి నుంచే మంచి లక్ష్యం తో ముందుకు వెళ్లాలని సూచించారు.
విద్యార్థుల ప్రదర్శన..
బాలికల దినోత్సవం సందర్భంగా పలువురు విద్యార్థినులు పాటలు ఆలపించారు. కరాటే ప్రదర్శన ఇచ్చారు. ఇటీవల జరిగిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బహుమతులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో డీఈఓ రమేష్, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ కళ చక్రపాణి, ఎంపీపీలు స్వరూపారాణి, మానస, జెడ్పీటీసీ పూర్మాని మంజుల, వార్డ్ కౌన్సిలర్ దేవదాస్, జీసీ డీఓ పద్మజ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ శారద, సీ డీపీఓ, సఖీ కేంద్రం కేంద్రం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
