బలగం టివి,సిరిసిల్ల:
బహుభాషా వేత్త , తెలుగు బిడ్డ తెలంగాణ బిడ్డ పివి కి భారత రత్న ఇవ్వడం మనందరీకి గర్వకారణం అని రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య అన్నారు.శని వారం సిరిసిల్ల పట్టణంలో ని లక్ష్మణ్ ప్రింటర్లో సాహితీ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా
రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి సాహితీవేత్త రాజకీయవేత్త విశ్వనాథ మహాకవి రచించిన వేయి పడగలు నవలను సహస్రపన్, హిందీలో రచించిన 14 భాషల కోవిదుడు, దార్శనీకుడు మరియు రాజకీయ చాణిక్యుడు అని అన్నారు., ప్రధానమంత్రి వరకు ఎదిగిన మహా మేధావి.అనేక సంస్కరణలకు వారధి పీవీ నరసింహారావు కి భారతరత్న అవార్డు ఇవ్వడం హర్షనీయమని అన్నారు . జూకంటి జగన్నాథం మాట్లాడుతూ పివీ ,టీవీ ఇది తెలుగువారికి గర్వకారణం, దార్శనికుడిగా సాహితీవేత్తగా ఘనంగా పేరు తెచ్చుకున్న మహనీయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జూకంటి జగన్నాథం, సహా అధ్యక్షులు కోడం నారాయణ ,ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, ఉపాధ్యక్షులు బూర దేవానందం, శ్రీకాదమైసయ్య , ముడారి సాయి ,మహేశ్ తదితరులు పాల్గొన్నారు.