తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..కొండూరి గాంధీరావు

0
106


తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని.. అందుకోసం కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యమత్యంతో విశ్రమించ కుండా పని చేయాలనీ కాంగ్రెస్ నాయకులు కోండూరి గాంధీరావు అన్నారు.గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అఫీసు ను స్థానికి కాంగ్రెస్ నాయకులతొ కలసి గాంధీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతుందని ,ఇచ్చిన ఏ హామీని కేసిఅర్ నిలుపుకోలేదని అన్నారు. ఈ ఎన్నికల్లో కేసిఅర్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తాయని , కాంగ్రెస్ మాత్రమే సుస్థిరమైన ప్రజాసుపరిపాలన అందిస్తున్న నమ్మకం ప్రజల్లో నెలకొందని అన్నారు. పార్టీ శ్రేణులు నిరంతరం శ్రమిస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టే యూత్, రైతు డిక్లరేషన్లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు హామిద్,ఎంపిటిసి పర్శరాములు,నాయకులు పాపగారి రాజు,బిచ్చాల రాజిరెడ్డి,చక్రీదర్ రెడ్డి,అంజిరెడ్డి,తిరుపతి,తిరుపతి రెడ్డి,తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here