బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
- నీళ్ళందక రైతన్నకు గోస
- చేతికొచ్చే పంటలు పశువుల పాలు
- ఉష్ణోగ్రత పెరిగి అడుగంటిన భూగర్భ జలాలు
- పశువులకు మేతగా మారుతున్న పంట పొలాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండలో కొన్ని పొలాలు నీరు లేక ఎడారిల తలపిస్తున్నాయి. తలపున నారాయణపూర్ చెరువు, శ్రీ రాజరాజేశ్వర జలాశయంలు (మధ్య మానేర్) ఉన్న నారాయణపూర్ చెరువు నుండి ఇతర మండలాలకు సైతం నీరు వెళ్తున్నాయి. నారాయణపూర్ చెరువు నుండి బోయినిపల్లికి వచ్చే కాలువ ఇప్పటికీ వరకు కూడా పూర్తి కాకపోవడంతో రైతులు వేసిన పంట పొలాలు ఎండిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నారాయణపూర్ నుండి తడగొండ చెరువు నుండి బోయినిపల్లి చెరువు లోకి డి4 కాలువ ద్వారా నీరు వచ్చినప్పుడు పొలాలు పచ్చగా ఉండేవని, ప్రస్తుతం నీళ్లు రాకపోవడంతో తడగొండలో పొట్టకు వచ్చిన పొలాలు ఎండిపోవడంతో గొర్రెలకు, పశువులకు మేతగా మారుతున్నాయి.

ఇప్పటికైనా నీళ్లు వదిలితే కొద్ది పంట అయిన చేతికి వస్తుందని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎండిపోయిన పొలాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
