కార్మికుల కష్టాలు తీర్చేలా మిషన్ల్ తయారి..
రాష్ట్ర మరియు జాతీయస్థాయిలో రాణిస్తున్న అక్కా తమ్ముడు.
బలగంటివి,సిరిసిల్ల:
ప్రతిభకు పేదరికం అడ్డురాదు. లక్ష్యం.. పట్టుదలకు కఠోర దీక్ష తోడైతే అనుకున్నది సాధించవచ్చు అని నిరుపిస్తున్నారు ఈ అక్క తమ్ముడు.కార్మికుల కష్టాలు తీర్చేలా మిష్ న్ల్ తయారి చేస్తూ రాష్ట్రీయ మరియు జాతీయస్థాయిలో ప్రతిభ కనబరుస్తూ ఇన్నోవేటర్స్ ప్రయోగాల్లో విజయాలను సాధిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జడ్పి హైస్కూల్ కి చెందిన విధ్యార్ధులు హేమంత్ పూనమ్. తమ ఇన్నోవేటర్స్ కార్యక్రమాలు కేవలం పాఠశాలకే పరిమితం కాకుండా నిజ జీవితంలో కూడా అవి వినియోగంలో వచ్చే విధంగా ప్రయోగాలు చేసి, ఔరా అనిపిస్తున్నారు .గణేష్ నగర్ కు చెందిన అక్కా, తమ్ముళ్లు హేమంత్ పూనమ్,సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య జడ్పి హైస్కూల్ లో చదువుతున్నారు..రెండు సంవత్సరాల క్రితం హేమంత్ తన తండ్రితో ఖాళీ సమయంలో మరమగ్గాల కార్ఖానాలో నేసిన గుడ్డను టాకాలు (మడత పెట్టడం) పట్టేవాడు. తండ్రి కరోనా సమయంలో మృతి చెందగా టాకాలు పడుతున్న హేమంత్ కు పని చాలా కఠినంగా ఉండేది. తనతండ్రి కూడా ఇంత కఠినమైన పని చేసేవాడని బాధపడేవాడు హేమంత్. దీనితో టాకాలు సులువుగా మడత పెట్టేలా మిషన్ తయారు చేయాలని గత సంవత్సరం మిషన్ తయారీ మొదలుపెట్టి, దాదాపు మూడు నెలలు శ్రమించి హేమంత్ మిషన్ పనిని పూర్తి చేశాడు. మిషన్ తయారీలో హేమంత్ కు అతని పాఠశాల టిచర్లు పాకాల శంకర్ గౌడ్, మోతిలాల్ ల ప్రోత్సాహం ఇచ్చారు. మిషన్ పనితీరును చూసి చాలా మంది ప్రశంసలు అందించారు. మరోవైపు అక్క పూనం కూడా ధాన్యం ఆరబెట్టినప్పుడు హఠాత్తుగా వర్షం పడితే వెంటనే కవర్ కప్పే యంత్రాన్ని తండ్రి సహాయంతో తయారుచేసింది. అయితే ఆ మిషన్ పనిచేయాలంటే స్విచ్ ఆన్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు పూనమ్ దానికి మరింత టెక్నాలజీ జోడించి ఆటోమేటిక్ గా తనకు తానే కవర్ కప్పే విధంగా మిషన్ ను అప్ గ్రేడ్ చేసింది. ఇంతే కాకుండా విద్యార్థుల కోసం ఒక మిషన్ తయారు చేసే ప్రాజెక్టు పై పని చేస్తున్నది పూనమ్.అలారం మోగినా బద్ధకంతో లేవలేని విద్యార్థుల కోసం ఫోన్ సహాయంతో వాటర్ పంపింగ్ జరిగేలా మిషన్ ను తయారు చేస్తోంది.
తండ్రి కష్టం చూసి చెల్లించి పోయా…
– హేమంత్
మరమగ్గాల కార్ఖానాలో నేసిన గుడ్డను టాకాలు (మడత పెట్టడం) పట్టేవాడు. మా నాన్న మరణించిన తర్వాత నేను ఆ పని చేసేసిన చలా కష్టంగా ఉండేది. చాలామంది నేత కార్మికులు ఈ పని చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, కార్మిక కష్టాలను చూసి ఈ మిష న్ తయారు చేశాను. మరింత ప్రోత్సాహం ఇస్తే మరిన్ని కార్మికులు ఉపయోగ పడేలా మరిన్ని మిషన్ల్ తయారు చేస్తాను.
