బలగం టీవి ,ఎల్లారెడ్డిపేట
జనవరి 3న ప్రభుత్వ జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం గా ప్రకటించాలని ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షుడు కానాపురం లక్ష్మణ్ మాదిగ అన్నారు. ఎల్లారెడ్డిపేట ఆర్టీసీ బస్టాండ్ లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలని బుధవారం రోజు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఆ మహనీయురాలు జయంతి వర్ధంతిలను అధికారికంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
సామాజిక మార్పు కై చైతన్యానికి లింగ సమానత్వానికి విద్యనే ఆయుధంసావిత్రిబాయి పూలే ఆశయ స్వప్నాల్ని నెరవేరుస్తాం భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రాథమిక హక్కుగా పొందుపరిచిన విద్యను అందరికీ అందేలా కృషి చేస్తాం అగ్రహారాల్లో బంధీగా ఉన్న అక్షరాన్ని మన దరికి చేర్చి బడుగుల బతుకులు వెలుగుల కోసం నడిపిన పోరాటాన్ని చేసిన త్యాగాన్ని అందించిన కృషిని స్మరిస్తూ వారి ఆశయాల సాధనకు శ్రమిస్తామని తెలియజేస్తూ
సామాజిక ఉద్యమ జోహార్లు తెలియజేస్తున్నాం
ఈ కార్యక్రమంలో బీటి నరసయ్య రజక సంఘం నాయకులు మరియు మహిళలు విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు.