ప్రభుత్వం టెక్స్ టైల్ పార్క్ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి శాశ్వత పరిష్కారం చూపాలి

0
108

బలగం టీవి…

  • సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని టెక్స్ టైల్ పార్క్ లో పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు,కార్యకర్తల సమావేశం యూనియన్ అధ్యక్షులు కూచన శంకర్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశానికి సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యి మాట్లాడుతూ గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు , యజమానుల వైఖరి వలన టెక్స్ టైల్ పార్క్ లో కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని అన్నారు. గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరలు ఇతర ప్రభుత్వ ఆర్డర్లతో ప్రత్యక్షంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో వేలాదిమంది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటూ పరోక్షంగా వస్త్ర పరిశ్రమను కార్మికుల ఉపాధిని సంక్షోభంలోకి నెట్టి వేయడం జరిగిందన్నారు.ఒకవైపు బతుకమ్మ చీరలు ,ప్రభుత్వ ఆర్డర్లు రావడంతో ప్రభుత్వ ఆర్డర్ల ఉత్పత్తిలో ప్రాఫిట్ ఎక్కువగా ఉండడం మరోవైపు సరైన మార్కెట్ లేకపోవడంతో యజమానులు ప్రైవేటు ఆర్డర్లపై కేంద్రీకరించకుండా కేవలం ప్రభుత్వ ఆర్డర్ల పైన ఆధారపడడం వలన వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం ఆర్డర్లు ఇస్తేనే ఉపాధి లేకుంటే లేదనే పరిస్థితి దాపురించిందని దీనివలన చాలామంది స్థానిక కార్మికులు ఈ వృత్తిని వదులుకొని ప్రత్యామ్నాయ ఉపాధిని చూసుకోవడం జరుగుతుందన్నారు.దీని వలన ప్రస్తుతం ఆ ప్రభుత్వ ఆర్డర్లు వచ్చినప్పుడు కూడా స్థానిక కార్మికులకు కాకుండా మెజార్టీగా వలస కార్మికులకే ఉపాధి దొరుకుతుందని అన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధి కార్మికుల సంక్షేమం కోసం సమగ్రంగా సమీక్ష జరిపి ప్రత్యామ్నాయంగా దిద్దుబాటు చర్యలు తీసుకొని కార్మిక ప్రయోజనాల కోసం చర్యలు చేపట్టి కార్మికులకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు.ఈసమావేశంలో టెక్స్ టైల్ పార్క్ పవర్ లుమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు నాయకులు అక్కల శ్రీనివాస్,ఆడెపు రవి,శుభ శేఖర్,రాజమల్లు,నాగయ్య, రాజశేఖర్,మనోహర్,శ్రీనివాస్, సత్యనారాయణ,కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here