బలగం టీవీ, వేములవాడ:
వేములవాడ పట్టణంలోని జగిత్యాల బస్ స్టాండ్ సమీపంలో గల జాతర గ్రౌండ్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన “శ్రీ మహదేవ్ టిఫిన్ సెంటర్” ను బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన, టిఫిన్ సెంటర్ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్థానికంగా స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తూ, ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ఇలాంటి హోటళ్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. పట్టణ ప్రజలకు, భక్తులకు రుచికరమైన, శుచికరమైన టిఫిన్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్వాహకులకు సూచించారు.
వ్యాపార రంగంలో యువత రాణించాలని ఆకాంక్షిస్తూ, ఈ సంస్థ యజమాన్యానికి ఆయన తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వర్తక సంఘం ప్రతినిధులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

