బలగం టివి,
తెలంగాణ రచయితల వేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక సినారె గ్రంథాలయంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ నాటి తెలంగాణ ఉద్యమం నుండి ఇప్పటివరకు సమాజాన్ని సరైన మార్గంలో నడిపించేది కవులు రచయితలేనని అన్నారు. పదేండ్ల నిర్బంధం నుండి తెలంగాణకు స్వేచ్ఛ స్వాతంత్రాలు లభించాయని ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పని చేయనుందని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. తెలంగాణ రచయితల వేదిక జాతీయ అధ్యక్షులు జగన్నాథం మాట్లాడుతూ 1950 సంవత్సరంలో జనవరి 26 గణతంత్ర దినోత్సవం గా ఏర్పడిందని ప్రజలకు సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్యాంగ ఏర్పడిన రోజని అన్నారు నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కవులు ఎప్పుడు రాజకీయాలకతీతంగా రాజకీయ అలని ప్రశ్నిస్తూ కవితలు రాస్తుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో తెరవేరాష్ట్ర అధ్యక్షులు కొండి మల్లారెడ్డి అధ్యక్షులు వెంగళ నాగరాజు ప్రధాన కార్యదర్శి వీరగోని చైతన్య గౌడ్
పాకాల శంకర్ గౌడ్ ఆడెపు లక్ష్మణ్ నాగిళ్ల రమేష్ బుర్కా గోపాల్ అలేఖ్య ఈడెపు సౌమ్య శోభారాణి అనిత కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు