ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో భేటి అయిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

బలగం టివి ,

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ,బీసీ సంక్షేమ & రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు సీతక్క,ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గార్లతో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు తేదీ 27-01-2024 శనివారం రోజున సిరిసిల్ల,వేములవాడ నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేకంగా సమావేశం అయ్యారు..

సాగునీటి పై ప్రత్యేక దృష్టి

-ప్రభుత్వం సాగునీటి పై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు.. కథలాపూర్,మేడిపల్లి,భీమారం మండల ప్రజల తాగు, సాగునీటికి ఎంతో ఉపయోగపడే కలికోట సూరమ్మ చెరువు కుడి,ఎడమ కాలువల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరారు..

  • వేములవాడ రూరల్ మర్రిపెళ్లి గ్రామంలోని మర్రిపల్లి చెరువు, కోనరావుపేట మండలంలోని లచ్చంపేట చెరువులను రిజర్వాయర్ లుగా మార్చడానికి నిధులు విడుదల చేయాలని కోరారు.
  • భీమారం మండలం గోవిందారం చెరువులోకి పోతారం రిజర్వాయర్ నుండి పైప్ లైన్ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరారు..

-సిరిసిల్ల జిల్లా పరిధిలో ఎగువ మానేరు 9వ ప్యాకేజ్ పనులు వెంటనే ప్రారంభించాల్సిందిగా కోరారు..

విద్యా పై ప్రత్యేక దృష్టి

  • అగ్రహారం డిగ్రీ కళాశాలలో బాలికల వసతిగృహం ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.

ఆలయ అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రణాళిక

  • దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి కొరకు, వేములవాడ పట్టణంలో జరిగే అభివృద్ధి పనులకు, VTDA(వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ)పరిదిలో జరిగే అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని కోరారు..

-త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన VTDA(వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ) పై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది..

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş