బలగం టీవి …వేములవాడ
వేములవాడ పట్టణంలో శ్రీ రాజా రాజేశ్వరి మున్నూరు కాపు నిత్య అన్నదాన ట్రస్ట్ సత్రంలో తూర్పువాడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసన్ మున్నూరు కాపు సంఘ సభ్యులు ఘనస్వాగతం పలికి గజమాలతో సత్కరించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన గెలుపు కోసం కృషి చేసిన సంఘ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వాదాలు అందిస్తే ప్రభుత్వ పెద్దలు తనకు విప్ గా అవకాశం ఇచ్చారన్నారు.. రానున్న రోజుల్లో ప్రభుత్వ అండదండలతో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.. గతంలో ఎన్నికల ప్రచార సమయంలో చాలామంది ఒక అబూత కల్పన సృష్టిస్తూ వేములవాడ రాజన్న గుడి చైర్మన్ చేసిన వారు ఎన్నికల్లో గెలవరని అపోహ సృష్టించారని, కానీ తన గెలుపుతో అపోహ పటాపంచలు అయిందన్నారు.. తన గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..
