– అధైర్య పడవద్దు అండగా ఉంటా
– ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన ప్రభుత్వ విప్
– ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని హామీ
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
బలగం టీవీ, హన్మాజీపేట:
వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగి మాజీ సర్పంచ్ గొర్రె రాజవ్వ మైసయ్య ఇల్లు దగ్ధం కాగ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దగ్ధం అయిన ఇల్లును పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.సెస్ అధికారులతో, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి తక్షణ సహాయం కింద పరిహారం అందజేయాల్సిందిగా సూచించారు. నిత్యావసర వస్తువులు బాధిత కుటుంబానికి అందజేశారు. వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
