బలగం టీవి …
డబ్బు చప్పుళ్లు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు
వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ఆదివారం ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డప్పు చప్పులతో ఊరేగింపుగా తీసుకు వెళుతూ మంగళ హారతులతో మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని అంబేద్కర్, నేతాజీ, చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి గల నివాళులు అర్పించారు, గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేసి, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన రెండు వంట గదులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
