బలగం టీవి ..వేములవాడ
ప్రతి వార్డును సందర్శిస్తూ రోగులకు అందుతున్న సేవలు గురించి తెలుసుకున్న ప్రభుత్వ విప్
రోగులకు మెరుగైన సేవలు అందించడంలో వైద్యులదే ముఖ్యపాత్ర
వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ప్రతి వార్డును తిరుగుతూ రోగులకు అందుతున్న సేవలు గురించి స్వయంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడంలో వైద్యులు ముఖ్యపాత్ర పోషించాలని ఎప్పటికప్పుడు ఏలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించాలని సూచించారు
