పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన, శ్రీ చౌడలమ్మ కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్..

0
185

బలగం టీవీ, రాజన్నసిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం కోడుముంజ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మరియు సంకెపల్లి గ్రామంలో యాదవ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ చౌడలమ్మ కల్యాణ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, పెద్దమ్మ తల్లి,చౌడలమ్మ దీవెనలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here