బలగం టీవీ, జగిత్యాల:
జగిత్యాల జిల్లా ఆదర్శనగర్ కు చెందిన వెల్లుల్ల మమత అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి తెలియజేయగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో చర్చలు జరిపి ప్రత్యేకమైన చికిత్స అందించవలసిందిగా ఆదేశిస్తూ మరియు ప్రభుత్వం నుండి 3,50,000 వేలు ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు డబ్బులను మంజూరు చేపించారు.. కాగ ఎల్ఓసి మంజూరు చేపించడం పట్ల బాధిత కుటుంబ సభ్యుల హర్షం వ్యక్తం చేస్తున్నారు..
