బలగం టివి, కోనరావుపేట
రామరాజ్యం తరహాలోని ప్రజారాజ్య పాలన
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కోనరావుపేట మండలం మామిడిపల్లి లో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారాలను మాఘ అమావాస్య పర్వదినం సందర్భంగా శుక్రవారం ఉదయం ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు.
ఆయన ఆలయం వద్దకు చేరుకోగానే అనుబంధ దేవాలయాల సూపరింటెండెంట్ శ్రీరాములు, గోలి శ్రీనివాస్, ఆలయ అర్చకులు ఆయనకు ఎదురేగి పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు.
అనంతరం ప్రధాన ఆలయంలో కొలువుదీరిన శ్రీ సీతారామచంద్ర స్వామివారలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆనాటి రామరాజ్యాన్ని తలపించే విధంగా ప్రజారాజ్య పరిపాలన చేస్తామని చెప్పారు.
కోనరావుపేట మండలం మామిడిపల్లిలో మాఘ అమావాస్య జాతర సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారల దర్శనం అనంతరం ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో సంపదను పెంచుతాం… ఆ సంపదను ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందిస్తామన్నారు.
దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా బలాన్ని ఇవ్వాలని శ్రీరామచంద్ర ప్రభువును కోరానని ఆయన తెలిపారు.
