బలగం టివి ,,రాజన్న సిరిసిల్ల
నేతన్నలకు ప్రభుత్వం వెన్ను దన్నుగా ఉంటుంది
- అధికారులకు నేతన్నలలో మనోధైర్యం ను నింపాలి
సిరిసిల్ల నేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా వెన్నుదన్నుగా ఉంటుందని మంత్రి శ్రీ పోన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
ఈ విషయంపై ప్రభుత్వం ఇప్పటికే కూలంకషంగా, లోతుగా చర్చించిందన్నారు. సిరిసిల్ల నేతన్నలకు 365 రోజులు పని కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. బతుకమ్మ చీరలతో పాటు పాలి కాటన్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వనుందన్నారు.
వస్త్ర తయారీకి అవసరమైన యార్న్ ను ప్రభుత్వమే సరఫరా చేయనుందన్నారు.
వర్కర్ టు ఓనర్ పథకానికి లబ్ధిదారులను గుర్తించేందుకు
సేట్లు, ఆసాములతో కాకుండా నేరుగా కార్మికులు, కార్మిక సంఘాలు ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ,చర్చించి వారి అభిప్రాయాలను తీసుకావాలనీ సంబంధిత అధికారులకు సూచించారు.
వర్కర్ టు ఓనర్ పథకం కింద పవర్ లూమ్ లు లేని కార్మికులకు యూనిట్లను కేటాయిస్తామని మంత్రి తెలిపారు.
టెక్స్టైల్ పార్క్ లో 2014 కు ముందు 119 పవర్ లూమ్ యూనిట్ లు ఉండగా 2023 నాటికి 60 కి తగ్గాయని అధికారుల నివేదికలు చెబుతున్నాయని మంత్రి అన్నారు. దీనిని బట్టి వస్త్ర పరిశ్రమ బలోపేతానికి ఎవరు అండగా నిలిచారో అర్థం చేసుకోవచ్చనన్నారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
అధికారులు కూడా క్షేత్రస్థాయిలో నేతన్నలలో మనోధైర్యాన్ని నింపేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు
వచ్చే వేసవిలో జిల్లాలో త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
వచ్చే వేసవిలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలనీ మిషన్ భగీరథ అధికారులను రాష్ట్ర రవాణా, బీసి సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదు కావడం,
జల వనరులలో నీటి నిల్వ తక్కువ ఉండడం వల్ల
వచ్చే వేసవిలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో త్రాగునీటి
సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని సోర్స్, స్టోరేజ్ సిస్టమ్, డిస్ట్రి బ్యూషన్ సిస్టమ్ లను పున:సమీక్షించి సోర్స్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకూ మిషన్ భగీరథ అధికారులు పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి, మున్సిపల్ అధికారులు మూడు రోజుల్లోగా
ఎక్సర్ సైజ్ పూర్తి చేయాలన్నారు. వేసవిలో త్రాగునీటి సరఫరా అన్ని గ్రామాలకు నిరంతరరాయంగా జరిగేలా చూడాలన్నారు.
చేప పిల్లల విత్తన ఉత్పత్తికి మధ్య మానేరు జలాశయం కేంద్ర బిందువు కావాలి
తెలంగాణ మొత్తానికీ చేప పిల్లల విత్తన సరఫరా కు రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని విధాలుగా అనువుగా ఉందన్నారు. మధ్య మానేరు జలాశయం కేంద్రంగా చేప పిల్లల విత్తన ఉత్పత్తి కి కేంద్ర బిందువుగా చేసి ఇక్కడి నుంచే తెలంగాణలోని అన్ని జలాశయాలకు చేప పిల్లలను సరఫరా చేసే కార్యచరణ సిద్ధం చేయాలని మంత్రి ఫిషరీస్ అధికారులకు సూచించారు.