నేడు అసెంబ్లీలో ఇరిగేషన్‌పై ప్రభుత్వం శ్వేత పత్రం …

0
99

 –బీసీ కుల గణనపై తీర్మానం

బలగం టివి,సిరిసిల్ల: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఎనిమిదవరోజు శుక్రవారం ఇరిగేషన్‌పై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   ప్రభుత్వం తరుపున శ్వేత పత్రం విడుదల చేయనుంది. దీనిపై సభలో స్వల్ప కాలిక చర్చ జరుగే అవకాశం ఉంది. ప్రభుత్వం బీసీ కుల గణనపై తీర్మానం ప్రవేశ పెట్టనున్నది,దినీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు.  గురువారం సభలో కాగ్ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాగ్ రిపోర్టులో కాలేశ్వరం ప్రాజెక్టులో అనేక అవకతవకలు జరిగినట్లు కాగ్ ప్రస్తావించింది.. మేడిగడ్డ కుంగిన విధానంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయనుంది. ఈ  రోజుతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here