గ్రామ పంచాయతీ మూడో ఫేజ్ ఎన్నికలకు సిద్దం..

0
110

– ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లోని 80 జీపీలు, 551 వార్డుల్లో ఎన్నికలు.

– మొత్తం ఓటర్లు మంది 1,27,920.

  • ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో ఫేజ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. ఈ నెల 17 వ తేదీన బుధవారం ఆయా గ్రామ పంచాయతీలు, వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్దమైంది.

మొత్తం ఓటర్లు…

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లో మూడో ఫేజ్ ఎన్నికలు నిర్వహించను న్నారు. గంభీరావుపేట మండలంలో 17,811మంది పురుషులు, 18,996 మహిళలు మొత్తం 36,807, ముస్తాబాద్ మండలంలో 18,658 మంది పురుషులు, మహిళలు 19,842 మొత్తం 38,500 ఓటర్లు ఉన్నారు. వీర్నపల్లి మండలంలో 5,769 మంది పురుషులు, 5,958 మంది మహిళలు మొత్తం 11,727 మంది, ఎల్లారెడ్డిపేట మండలంలో 19,690మంది పురుషులు, 21,196 మహిళలు మొత్తం 40,886 మంది ఓటర్లు ఉన్నారు.

551 పోలింగ్ కేంద్రాలు..

ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లో మొత్తం గ్రామ పంచాయతీలు 87, వార్డు స్థానాలు 762ఉండగా, సర్పంచ్ స్థానాలు 7, వార్డు స్థానాలు 211 ఏకగ్రీవమయ్యాయి. ఈ నెల 17 వ తేదీన బుధవారం గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 80, వార్డుల్లో 551 ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్ స్థానాలకు అభ్యర్థులు 379, వార్డు స్థానాలకు 1,526 అభ్యర్థులు మంది పోటీలో ఉన్నారు.

ప్రణాళిక సిద్ధం

ఎన్నికలకు మూడు మండలాల్లో కలిపి మొత్తం 914 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు 1,244 మంది విధులు నిర్వర్తించనున్నారు. ఎన్నికల సామగ్రి, అధికారులు, సిబ్బందిని తరలించేదుకు ఎల్లారెడ్డిపేట మండలంలో మొత్తం జోన్స్ 7, రూట్స్ 10, గంభీరావుపేట మండలంలో జోన్స్ 5, రూట్స్ 10, ముస్తాబాద్ మండలంలో జోన్స్ 4, రూట్స్ 8, వీర్నపల్లి మండలంలో జోన్స్ 2, రూట్స్ 5 ప్రణాళిక సిద్ధం చేశారు. నాలుగు మండలాల్లో కలిపి మొత్తం పోలింగ్ కేంద్రాలు 551 సిద్ధం చేశారు.

ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా..

ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు జాబితాలో పేరుండి… ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) కాకుండా ఈ కింద చూపిన 18 ప్రత్యామ్నాయ ఫొటో ఐడీలలో దేనినైనా ఒకటి పోలింగ్ సిబ్బందికి చూపి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

ఆధార్, భారతీయ పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్ యూలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు, బ్యాంకు, తపాలా కార్యాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్ బుక్, పాన్ కార్డు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్ఏఐ) కింద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఇండియా(RGI) జారీ చేసిన స్మార్ట్ కార్డు, శాసనసభ, శాసనమండలి జారీ చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధికారిక గుర్తింపు కార్డులు, ఫాటోతో కూడిన స్వాతంత్ర్య సమరయోధుల గుర్తింపు కార్డు, లోక్ సభ, రాజ్యసభ జారీ చేసిన ఎంపీ గుర్తింపు కార్డు, ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు జారీ చేసిన ఫాటోలతో కూడిన ఉపాధి హామీ జాబ్ కార్డు, కేంద్ర కార్మికశాఖ జారీచేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్, రేషన్ కార్డు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ధ్రువపత్రాలు, పెన్షన్ పత్రాలు, ఆయుధాల లైసెన్స్, దివ్యాంగ ధృవీకరణ పత్రం, పట్టాదారు పాస్ బుక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here