బలగం టివి, ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు యువత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.మరాఠా యోధుడు,బహుజన చక్రవర్తి పేద వర్గాల హక్కుల సాధన కోసం పోరాటం చేసిన మహావీరుడు చత్రపతి శివాజీ జయంతికి ఘన నివాళులు అర్పిస్తూ మొఘలుల సామ్రాజ్యవాదాన్ని ఎదురించిన ధైర్యశాలి శత్రువులను గడగడలాడించిన వీరుడు చత్రపతి శివాజీ అని యువత పేర్కొన్నారు.హిందూ దేవాలయాల పరిరక్షణతో పాటు ఇతర మతాలను గౌరవించారని సామ్రాజ్య విస్తరణలో అన్ని మతాల వారికి తమ సైన్యంలో ఉద్యోగాలు కల్పించి, పరమత సహనం పాటించారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు