ఘనంగా సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్.

0
110

బలగం టీవి , ముస్తాబాద్

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ పద్మ- దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా గ్రామ యువకులకు క్రికెట్ టోర్నమెంట్ క్రీడలు నిర్వహించారు.రెండు రోజులుగా జరుగుతున్న ఈ క్రీడల్లో వినయ్ జుట్టుపై జవ్వాజి బాలకృష్ణ జుట్టు గెలిపొందారు. నరేష్ జుట్టు,అంజన్ జుట్టు తలపడగా అందులో అంజన్ కుమార్ జుట్టు గెలిపొందారు. ఫైనల్ మ్యాచ్ లో బాలకృష్ణ జుట్టు,అంజన్ జట్టుకు జరిగిన పోటీలో బాలకృష్ణ జట్టుపై అంజన్ కుమార్ జట్టు విజేతగా నిలిచింది. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ యువకులకు సర్పంచ్  క్రీడలు నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నామన్నారు.క్రీడలతో శారీరకంగా మానసికంగా బలపడుతూ సోదర బావ ఏర్పడుతుందని వెల్లడించారు.సర్పంచ్ కు గ్రామ యువత ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here