బలగం టీవి ,రుద్రంగి :
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో బుధవారం భారతదేశ మెుట్టమెుదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.సావిత్రి బాయి పూలే జయంతిని పురస్కరించుకొని 30 మంది మహిళా ఉపాద్యాయినిలను సాలువాలతో సన్మానించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ హరినాథ్ రాజు మాట్లాడుతూ సావిత్రి బాయి పూలే మన దేశంలో మెుట్టమెుదటి భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి అని, ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అన్నారు.పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి చేసిన కృషి అమోఘం వారు తొలితరం మహిళా ఉద్యమకారిణి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎలిగేటి నరేష్, ప్రిన్సిపాల్ హరినాథ్ రాజు, డైరెక్టర్లు తీపిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎర్రం గంగా నర్సయ్య, పడాల సురేష్ ఉపాద్యాయిని ఉపాద్యాయులు ,విద్యార్థులు తదతరులు పాల్గోన్నారు.