బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిరిసిల్ల అర్బన్ చంద్రంపేట జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థిని విద్యార్థులు చేసిన సైన్స్ ఎగ్జిబిట్స్ అందరిని ఆలోచింపచేసాయి. సైన్స్ ఉపాధ్యాయులు శ్రీనివాస్,అంజలి లు విద్యార్థులను ఉత్తేజితం చేసి వారిచే అద్భుతమైన ప్రయోగాలు చేయించారు. విద్యార్థులు తయారు చేసిన ఈ ఎగ్జిబిట్స్ ద్వారా శాస్త్రీయ దృక్పథాన్ని ,శాస్త్రీయ వైఖరి పెంపొందడానికి తోడ్పడతాయని, మూఢనమ్మకాలను పారద్రోలడానికి సైన్స్ ఏకైక అస్త్రంగా పనిచేస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనమాలై శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ ఎగ్జిబిట్స్ ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులను అందించారు.అనంతరం సైన్స్ ఉపాధ్యాయులను పాఠశాల ఉపాధ్యాయులు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం సామల దేవామని,కైరి పద్మ , కొండికొప్పుల రవి,గువలకొండ శ్రీనివాస్ , వేముల అంజలి,ముంజ రమ,వొద్యారం మధుసూదన్,త్రివేణి,లత మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

