బలగం టీవీ ఎల్లారెడ్డిపేట :
శ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 బ్రాంచ్ లో ఈ ప్రపంచాన్ని శాసిస్తూ నడిపించే గొప్ప శక్తి సైన్స్ అని ఎంఈఓ కృష్ణ అన్నారు.
నేషనల్ సైన్స్ డే సందర్భంగా శుకరవారం శ్రీ చైతన్య కొంపల్లి-5 బ్రాంచ్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రసాయన శాస్త్ర శాస్త్రవేత్త సింహాచలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైజ్ఞానిక రంగంలో విద్యార్థులు చేసిన వివిధ ప్రయోగాలను పరిశీలించి చిన్నారుల ప్రతిభను మేధాశక్తిని కొనియాడారు. అనంతరం బ్రాంచ్ ప్రిన్సిపల్ సాయికృష్ణ మాట్లాడుతూ భారతీయ విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తుల్లో సివి రామన్ అగ్రగన్యుడు అని,ఈయన 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ కనుకొన్న కారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ దీనికి జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. వైజ్ఞానిక రంగంలో అద్భుత ప్రయోగాలు చేసి వాటిని ప్రదర్శించడం శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులకు సాధ్యమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి జోన్ ఏజీఎం జీవీ రమణ రావు,ఆర్ఐ చక్రి,పాఠశాల ప్రిన్సిపల్ సాయికృష్ణ,హాస్టల్ ప్రిన్సిపల్ చందు,అకాడమిక్ జోనల్ కోఆర్డినేటర్ రవి, డీన్ గోవింద్,అసోసియేట్ డీన్ సంపత్ ఐపీఎల్ ఇన్చార్జి శ్రవణ్, ఐకాన్ ఇంచార్జి శివానంద్, సిబ్యాచ్ ఇంచార్జి రణదీప్,ప్రైమరీ ఇన్చార్జి వాసవి,సైన్స్ విభాగానికి సంబంధించిన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
