బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం.

0
169

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

  • గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 16 ఫిర్యాదులు స్వీకరణ.

– జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమావారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం సిరిసిల్ల లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ భూ తగాదాలు,ఆస్థి తగాదాల విషయంలో చట్ట ప్రకారం, నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా చూడాలని అన్నారు .గ్రీవెన్స్ డే ఫిర్యాదులు ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందిస్తున్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూనే అసాంఘిక శక్తులు, నేరస్థుల పట్ల కఠిన వైఖరి అవలంభిస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూస్తామని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని అన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here