బలగం టీవీ, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం చింతలకుంట వాస్తవ్యులు గడ్డం సచ్చిందర్ రెడ్డి రమాదేవి జీఎస్‍ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇల్లంతకుంటలోని శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ధ్వజస్తంభం ఇత్తడి లోహంతో తయారు చేయబడిన తొడుగు చేయించడానికి 3,00,000/(మూడు లక్షలు) రూపాయలు చెక్కును విరాళంగా అందచేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ గడ్డం జీవన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ మామిడి రాజు, తూముకుంట మోహన్ రెడ్డి, కట్ట ఎల్లారెడ్డి, గోపాల్ చారి, కొట్టె వెంకటి తదితరులు పాల్గొన్నారు.
