సిరిసిల్ల న్యూస్: వేములవాడ నియోజకవర్గం:
● బీ-ఫారం అందజేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి
అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గల్ఫ్ జెఏసి ఛైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ కు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి బుధవారం రాత్రి కరీంనగర్ లో బీ-ఫారం అందజేశారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా రవిగౌడ్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేసే అవకాశం రావడం ఒక గొప్ప గౌరవం అని అన్నారు. గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ రిటనీలు, గల్ఫ్ కుటుంబాల మద్ధతుతో పోటీలో ఉంటానని, జీరో బడ్జెట్ పాలిటిక్స్ నినాదంతో గెలుపు దిశగా సాగుతానని అన్నారు.