సిరిసిల్ల న్యూస్: సిరిసిల్ల నియోజకవర్గం:
సిరిసిల్లలో గల్ఫ్ కార్మికుల తరపున MLA అభ్యర్థిగా నామినేషన్ వేసిన GWAC అధ్యక్షులు కృష్ణ దొనికెని
ఈరోజు మధ్యాహ్నం సిరిసిల్లలో GWAC సైనికులతో మరియు గల్ఫ్ కార్మిక కుటుంబాలతో కలిసి అమరవీరుల స్తూపం నుండి ర్యాలీ గా వెళ్ళి సిరిసిల్ల నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి గారికి నామినేషన్ పేపర్లను అందించిన కృష్ణ దొనికెని.
గత 10 సంవత్సరాలలో వేల కోట్ల రూపాయల విదేశీ మరకద్రవ్యం కేసీఆర్ ప్రభుత్వానికి అందించిన గల్ఫ్ కార్మికులు, వారి సంక్షేమం కోసం 500 కోట్ల బడ్జెట్ పెట్టి తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసితో కూడిన గల్ఫ్ బోర్డును ఎర్పాటు చేసి మా గల్ఫ్ కార్మికుల సంక్షేమం పై దృష్టి పెట్టలని ఎన్నీ సార్లు వినతిపత్రాలు ఇచ్చిన పట్టించుకొలేదని అందుకే తెలంగాణ లో ఒక కోటికి పైగా ఉన్న ఓటు యొక్క సత్తా అలాగే సిరిసిల్ల లో ఉన్న 1లక్షకు పైగా ఉన్న గల్ఫ్ కార్మికుల ఓటు పవర్ ను ఈ ఎలక్షన్లలో చూపించబోతున్నట్టు ఈ సందర్భంగా మీడియా తో తెలిపారు.
కేసీఆర్ కుమారుడిగా ఇదే నియోజకవర్గంలో కేటీఆర్ చేసినా అభివృద్ధి మెయిన్ రోడ్లు బాగు చెయ్యడం మాత్రమేనని,
మిడ్ మనేరు ప్రాజెక్ట్ క్రింద ఉన్న గ్రామాల నుండి గల్ఫ్ దేశాలకు ఇంకా వలసలు వెళ్తున్నారని, జిల్లేల మరియు చిప్పపల్లి నుండి గల్ఫ్ వలసలు తగ్గాయని కేటీఆర్ అబద్ధాలు చెపుతూ పబ్బం గడుపుతున్నారని,
గల్ఫ్ లో తెలిసి తెలియక మరియు తప్పులు చెయ్యకపోయినా వందలాది తెలంగాణ బిడ్డలు జైళ్ళలో మగ్గుతున్న విషయం తెలిసిన ఒకరిద్దరికే సహాయం అందించి తెలంగాణ బిడ్డలకు అందరికీ సహాయం అందించినట్టు గప్పలు కొడుతున్నారని తెలిపారు.
గల్ఫ్ సంక్షేమం విషయంలో ఒక రూపాయి ఖర్చు పెట్టని కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా కేటీఆర్ నూ సిరిసిల్లలో ఓడించెల ప్రణాళిక బద్దంగా ఎన్నికల ప్రచారంలో గల్ఫ్ కార్మిక కుటుంబసభ్యులకు వివరించి.. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మా గల్ఫ్ కార్మికుల సత్తా చూపిస్తామని ర్యాలీలో పాల్గొన్న గల్ఫ్ కార్మికుల సమావేశంలో గర్జించిన GWAC అద్యక్షులు కృష్ణ దొనికెని.
ఈ నామినేషన్ కార్యక్రమానికి తెలంగాణ లోని వివిధ జిల్లాల నుండి GWAC సభ్యులు మరియు గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కృష్ణ దొనికెని
GWAC – అద్యక్షులు
గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక
GWAC – Gulf Workers Awareness Center