బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లయ్య అలియాస్ చింతపండు నవీన్ ని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కులాల పైన మతాల పైన చిచ్చు పెడుతూ పబ్బం గడుపుకుంటున్న తీన్మార్ మల్లయ్య భవిష్యత్తులో రెడ్డిల ఆగ్రహానికి గురికాక తప్పదు అని, అక్రమ సంపాదన పైన పడి తనకంటూ ఒక జెండా ఎజెండా లేని వ్యక్తి తీన్మార్ మల్లయ్య అని ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే గుడ్డలు ఊడదీసి కొడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు ఎగుమామిడి కృష్ణారెడ్డి, నరెడ్ల రాఘవరెడ్డి మరియు న్యాలకొండ రాఘవరెడ్డి, ఎడమల తిరుమలరెడ్డి, ఎడమల హనుమంత రెడ్డి, కంది భాస్కర్ రెడ్డి, కంకణాల శ్రీనివాస్ రెడ్డి, ఎసిరెడ్డి రాంరెడ్డి, ఉమ్మారెడ్డి సత్య నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.