ఆనందం వ్యక్తం చేసిన బాధితుడు
బలగం టివి, ప్రతినిధి:ఇల్లంతకుంట
సి.ఇ.ఐ.ఆర్ అప్లికేషన్ సహాయంతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ పట్టుకొని బాధితుడికి అప్పగించడం జరిగిందని ఇల్లంతకుంట ఎస్ఐ డి.సుధాకర్ తెలిపారు. గతంలో ఇల్లంతకుంట గ్రామానికి చెందిన గొడుగు హరికుమార్ s/o నరసయ్య తన 18,000/- విలువ గల OPPO -F17 మొబైల్ ఫోన్* MARCH-2022 పోయిందని ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ కు రాగా వారి మొబైల్ ఫోన్ ల వివరాలను సి.ఇ.ఐ.ఆర్ అప్లికేషన్ లో 19-12-2023 రోజున నమోదు చేయగా అట్టి ఫోన్ లో వేరే వ్యక్తి సిమ్ కార్డు వేయడంతో పోలీస్ స్టేషన్ కు అలెర్ట్ మెసేజ్ రావడం తో అట్టి మొబైల్ ఫోన్ ను 30-12-2023 రోజున గుర్తించి , బాధితుడికి అప్పగించడం జరిగింది అని, దీనితో మొబైల్ ఫోన్ పోయిన భాదితుడు ఆనందాన్ని వ్యక్తం చేశారని అయన తెలిపారు. ఈ మొబైల్ ఫోన్ నీ గుర్తించడం లో కృషి చేసిన ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ సిబ్బంది అనిల్, లక్ష్మీనారాయణ లను ఎస్సై డి సుధాకర్ అభినందించారు. మండలంలో ఎవరివైన మొబైల్ ఫోన్లు పోయినట్లయితే వెంటనే ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయాలని అయన తెలిపారు.