కిషన్ దాస్ పేటలో ఘనంగా హనుమాన్ ఆలయ వార్షికోత్సవం..

0
83

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేటలోని చిన్న బడి సమీపంలో కొలువై ఉన్న భక్త ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ వార్షికోత్సవం సందర్భంగా కిషన్ దాస్ పేట పరిసర ప్రాంతాలు భక్తిమయ వాతావరణంతో నిండిపోయాయి.

ఈ వేడుకల్లో మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, ప్రముఖ నాయకులు ఎనగందుల నర్సింలు, గుండాడి వెంకట్ రెడ్డి, బొమ్మ కంటి వెంకన్న గుప్తా, మార్కండేషన్ గుప్తా, గన్నమనేని సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here