*మానవత్వం చాటుకున్న తోటి
ఫోటో,వీడియో గ్రాఫర్లు.
బలగం టివి, , ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పది రోజుల క్రితం కొమ్మేట శ్రీకాంత్ కు చెందిన క్రేజీ ఫోటో స్టూడియో విద్యుత్ ఘాతంతో పూర్తిగా కాలిపోవడం జరిగింది. శ్రీకాంత్ కు జరిగిన ఆర్థిక నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని తోటి ఫోటో, వీడియో గ్రాఫర్లు మానవత్వంతో ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చారు.శుక్రవారం ముస్తాబాద్ మండల ఫోటో & వీడియో గ్రాఫర్లు,ఇతర మండలాల ఫోటో & వీడియో గ్రాఫర్లు తమ వంతు సహాయంగా ముప్పై వేల నగదు రూపాయలు శ్రీకాంత్ కు అందించి తమ ఉదార గుణాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక రాజు, బండారి శ్రీకాంత్, బట్టు జీవన్, కసోడి రమేష్,ఈరవెని సత్యనారాయణ,ఎర్రోళ్ల నరేష్ , పల్లె వెంకట్,రంజాన్ నరేష్,నక్క ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.