అటు రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ లో పంపించి‌‌‌‌‌‌ ఇటు కాంగ్రెస్‌‌ లోకి జంప్‌‌

0
195

బలగం టివి, ఎల్లారెడ్డిపేట

ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బండారి బాల్ రెడ్డి కి జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల కొంతకాలంగా అసంతృప్తిగా ఉండి పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. తర్వాత కేకే మహేందర్‌‌ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌‌ లో చేరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌‌ నాయకులు , కార్యకర్తలు పాల్గోన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here