బలగం టీవీ, బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం రోజున బోయినిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య బృందం సందర్శించి, పిల్లలకు వైద్య పరీక్షలు చేసి,అవసరమైన మందులను పంపిణీ చేశారు. వైద్యాధికారి డాక్టర్ కార్తీక్ మాట్లాడుతూ.. పిల్లలకు నోటి పరిశుభ్రత, హ్యాండ్ వాష్ టెక్నిక్, చలికాలంలో వచ్చే నిమోనియా, అస్తమా,ఎలర్జీకి సంబంధించిన వ్యాధులపై పిల్లలకు అవగాహన కల్పించామని, అనంతరం స్కూల్ హాస్టల్ ను సందర్శించి పిల్లలకు పరిశుభ్రమైన పోషకాహారాన్ని, వేడి వేడిగా ఎప్పటికప్పుడు అందించాలని వార్డెన్ కి సూచనలు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ టి.హేమలత, ఎస్.ఓ లింగవ్వ, సబ్ సెంటర్ ఆరోగ్య కార్యకర్త ఉషాదేవి, స్కూల్ ఆరోగ్య కార్యకర్త ప్రసన్న, ఆశా కార్యకర్త లత, తదితరులు పాల్గొన్నారు.

