రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దివ్యాంగులకు శుభవార్త..
జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో డిసెంబర్ 2025 సదరం క్యాంపుల నిర్వహణ తేదీలు ఖరారు
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డిసెంబర్ 15, 2025 నుండి డిసెంబర్ 20, 2025 వరకు సదరం (SADAREM) శిబిరాలను నిర్వహించనున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. దివ్యాంగులకు UDID సర్టిఫికెట్ల జారీ కోసం ఈ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. సంబంధిత వైద్యుల సూచనల మేరకు వివిధ విభాగాలకు సంబంధించిన క్యాంపుల తేదీలను, పరీక్షించబడే దివ్యాంగుల సంఖ్యను వివరంగా ప్రకటించారు.
| క్రమ సంఖ్య | క్యాంపు తేదీ | రోజు | విభాగము |
| 1 | 15.12.2025 | సోమవారం | కంటిచూపు – 21 |
| 2 | 16.12.2025 | మంగళవారం | ఆర్తో – 45 |
| 3 | 16.12.2025 | మంగళవారం | మానసిక – 25 |
| 4 | 17.12.2025 | బుధవారం | మానసిక – 20 |
| 5 | 17.12.2025 | బుధవారం | జనరల్ – 06 |
| 9 | 17.12.2025 | బుధవారం | వినికిడి (Hearing) – 35 |
| 6 | 18.12.2025 | గురువారం | ఆర్తో – 45 |
| 10 | 18.12.2025 | గురువారం | వినికిడి (Hearing & Speech & Language) – 36 |
| 7 | 19.12.2025 | శుక్రవారం | ఆర్తో – 45 |
| 8 | 20.12.2025 | శనివారం | ఆర్తో – 45 |
పైన తెలిపిన తేదిలలో సదరం శిబిరానికి హాజరయ్యే దివ్యాంగులు ఉదయం 09:30 గంటలకు చేరుకోవాలి. తమ వెంట మెడికల్ డాక్యుమెంట్లు, ఎక్స్-రే, UDID అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, మరియు ఫోన్ నెంబర్ తప్పనిసరిగా తీసుకురావాలి. సదరం క్యాంప్‌కు హాజరయ్యే వారి పేర్లు మరియు వివరాలు ఇప్పటికే పంచాయతీ కార్యదర్శి / మున్సిపాలిటీలలో బిల్లు కలెక్టర్‌కు పంపడం జరిగింది. ఈ వివరాలను మండల అభివృద్ధి అధికారులు మరియు కమిషనర్లు (సిరిసిల్ల, వేములవాడ) తమ పరిధిలోని దివ్యాంగులకు తెలియజేసి, వారికి సమాచారం అందేలా చూడాలని కోరనైనది.
