ఎల్లారెడ్డిపేట
విద్యార్థులు పరిశుభ్రత పాటించాలనీ,పౌష్టికాహారం తినాలని, వ్యాయామం,యోగా లాంటివి చేయాలని,ఆరోగ్యంగా ఉంటేనే చక్కగా చదువుతారని, ఆరోగ్యమే మహాభాగ్యమని మెడికల్ ఆఫీసర్ డా.సంధ్యారాణిఅన్నారు.
బుధవారం రోజున యెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్రీయ బాలల స్వస్థ్య కార్యక్రమం టీం(ఆరు.బి.ఎస్.కె) మరియు జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్) ఆధ్వర్యంలో హెల్త్ చెకప్(ఆరోగ్యం పరిశీలన) కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థుల బరువు, ఎత్తు కొలిచారు.జనరల్ చెకప్, హెచ్.బి టెస్ట్ మొదలగు పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు భోజనం చేయాలని, శరీరంను ఆరోగ్యం గా ఉంచుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని,మంచిగా చదివి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలనీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్ క్రితం సత్యనారాయణ, జాతీయం సేవా పథకం ప్రోగ్రామ్ అధికారి వాసరవేణి పర్శరాములు, రాష్ట్రీయ బాలల స్వస్థ్య కార్యక్రమం టీం సభ్యులు డా.సాయిచంద్ర, డా.సంధ్యారాణి, ఫార్మాసిస్టు అంజలి, కళాశాల ఉపన్యాసకులు మాదాసు చంద్రమౌళి,చెరుకు భూమక్క, బుట్ట కవిత, నీరటి విష్ణు ప్రసాద్,ఆర్.గీత ,చిలుక ప్రవళిక, కొడిముంజ సాగర్ బోధనేతర సిబ్బంది విమల్ కుమార్, కె.దేవేందర్, ఎం.డి. తాజోద్దిన్ మరియు లక్ష్మీ, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
