బలగంటివీ, తంగళ్లపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని గ్రామపంచాయతీ పాలకవర్గానికి సర్పంచ్ గణప శివజ్యోతి ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పాలకవర్గానికి శాలువతో సన్మానించి మెమొంటోస్ అందజేశారు. అనంతరం తాను మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో ఈ ఐదు సంవత్సరాలు సహకరించిన పాలకవర్గానికి, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు 10 ఉత్తమ అవార్డులు వచ్చాయని అందులో మన గ్రామనికి కూడా జాతియ స్థాయిలో అవార్డులు రావడం సంతోషకరమన్నారు. మాజీమంత్రి కేటీఆర్, అధికారుల సమిష్టి సహకారంతో గ్రామ అభివృద్ధి సాధించామన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సిబ్బంది పంచాయతీ కార్యదర్శి రఘు, గ్రామస్తులు పాల్గొన్నారు.