పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము
తిప్పాపూర్ గోశాలలో 137 జతల కోడెల పంపిణీ
- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
బలగం టీవీ, వేములవాడ:
కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. శుక్రవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన తిప్పాపూర్ లోని గోశాలలో కోడెల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలను పరిశీలించి, అర్హులైన రైతులకు 137 జతల కోడెలను 274 జీవాలను అధికారులు రైతులకు ఆదివారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోశాల నుంచి పంపిణీ చేసే కోడెలను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. వాటిని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పక్కాగా చూడాలని సూచించారు. వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సంరక్షించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఈఓ రాధాభాయి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, గోశాల కమిటీ సభ్యులు రాధా కృష్ణ రెడ్డి, పశు వైద్యాధికారులు, వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.





