29వ తేదీన కోడెల పంపిణీ కార్యక్రమం

0
235

– అర్హులైన రైతులు సంబంధిత పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి..

– ఆలయ ఇన్చార్జి ఈవో రాధాబాయి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి

బలగం టీవీ, వేములవాడ:

ఈ నెల 29వ తేదీన వేములవాడ తిప్పాపూర్ లోని గోశాలలో కోడెలను పంపిణీ చేయనున్నట్లు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఇన్చార్జి ఈవో రాధాబాయి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వేములవాడ తిప్పాపూర్ గోశాలలోని 250 కోడెలను ఆదివారం ఉదయం పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు అర్హులని స్పష్టం చేశారు. కోడెల కోసం అర్హత కలిగిన రైతులు జిల్లా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన రైతులు పట్టాదారు పాస్ బుక్ ఆధార్ కార్డ్ మొదలగు సంబంధిత ధ్రువ పత్రాలతో ఈ వెబ్సైట్ https://rajannasircilla.telangana.gov.in/ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. కోడెలు పంపిణీ చేసే రోజున రైతులు ఆన్లైన్లో నమోదు చేసిన ఆయా సర్టిఫికెట్లు పత్రాలు వెంట తీసుకురావాలని తెలిపారు. అర్హులైన రైతులకు మాత్రమే జియో ట్యాగింగ్ కలిగి ఉన్న కోడెలను పంపిణీ చేయనున్నామని అన్నారు.

జియో ట్యాగింగ్ ఉన్న కోడెలు, వెబ్సైట్ లో రైతుల వివరాలు నమోదు చేయడంతో జీవాలు పక్కదారి పట్టే అవకాశం ఉండదని, భవిష్యత్తులో వాటి సంరక్షణను పరిశీలించవచ్చనిస్పష్టం చేశారు. కోడెలను తీసుకువెళ్లే రైతులు వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా పక్కాగా చూసుకోవాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here