కోడెలను నిత్యం పర్యవేక్షిస్తూ.. సంరక్షించాలి..

0
182
  • జిల్లా పశు వైద్యాధికారి రవీందర్ రెడ్డి

గోశాలలకు ఎంపిక చేసిన సిబ్బందికి అవగాహన సదస్సు..

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన రెండు గోశాలలోని కోడెలను నూతనంగా ఎంపిక చేసిన సిబ్బంది వాటిని నిత్యం పర్యవేక్షిస్తూ సంరక్షించాలని జిల్లా పశు వైద్యాధికారి రవీందర్ రెడ్డి సూచించారు. వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాల, ఆలయానికి సమీపంలోని కట్టకింద గోశాలలో పనిచేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారిలో నుంచి పలువురిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జిల్లా పశువైద్యాధికారి రవీందర్ రెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్ గురువారం అవగాహన కల్పించారు.

అనంతరం ఆయా గోశాలలో నియామకమైన సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పశువైద్యాధికారి శ్రీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కోడెలు, ఆవుల సంరక్షణపై వివరించారు. ప్రతి రోజు జీవాలకు పచ్చి గడ్డి, ఎండు గడ్డి, దాణా మూడు సార్లు ఇవ్వాల్సి ఉంటుందని, వాటికి నిత్యం పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. జీవాలు ఉండే పరిసరాలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. అలాగే వాటి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ గోశాలలోని పశువైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. గోశాలలో పశువైద్యాధికారి, సహాయకులు, అటెండర్ తదితరు అందుబాటులో ఉంటారని వెల్లడించారు గోశాలలోని జీవాలకు సీజనల్ గా అన్ని టీకాలు వేసేలా చూసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క సిబ్బంది బాధ్యతగా తమ విధులు నిర్వర్తించి జీవాలను సంరక్షించాలని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here