*50 కిలోల బియ్యం వితరణ
*ఆదర్శంగా నిలుస్తున్న నాయకుడు దీటి నర్సింలు.
బలగం టీవి .. ప్రతినిధి ముస్తాబాద్.
ముస్తాబాద్ మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి మోతె నరేష్ అనారోగ్యంతో వారం రోజుల క్రితం మృతి చెందాడు.మృతుని కుటుంబానికి 50 కిలోల బియ్యం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నర్సింలు మానవత్వంతో అందించి నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ పలువురికి చేతన అందించడం పట్ల పలువురు అభినందించారు.ముస్తాబాద్ మండల ప్రజా ప్రతినిధులు కనీసం పరామర్శించకపోవడం తమను ఎంతో ఆవేదనకు గురి చేసిందని మృతుని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.ఎన్నికలు ఉంటే ఎంతో హడావిడి చేసే నాయకులు ఆపద వస్తే ఆమడ దూరంలో ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆ నిరుపేద కుటుంబాన్ని ఎవరైనా దాతలు స్పందించి ఆదుకోవాలని, ప్రభుత్వం కూడా సాయం అందించాలని నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు సద్ది మధు,ముక్క నర్సయ్య,మచ్చ కొండయ్య, మాడూరి కిషన్, జంగం త్రినేత్రం తదితరులు పాల్గొన్నారు.