*అండగా పోచమ్మ యూత్ సభ్యులు.
బలగం టివి,ముస్తాబాద్i
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పోచమ్మ యూత్ సభ్యులు నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ, సామాజిక సేవా కార్యక్రమాలతో, నిస్వార్ధమైన సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళితే నిరుపేద కుటుంబాలకు సహాయం అందించడంలో ముందుంటామని మరోసారి పోచమ్మ యూత్ సభ్యులు రుజువు చేశారు. మండల కేంద్రంలోని కెసిఆర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ సముదాయంలో మహమ్మద్ జరీనా అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ఆ కుటుంబానికి 50 కిలోల బియ్యం వితరణ చేశారు. సహాయం చేసిన మృతురాలి కుటుంబ సభ్యులు పోచమ్మ యూత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపా