హిడ్మా ఎన్‌కౌంటర్ బూటకం: మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల..!

0
61

మావోయిస్టు నేతలు దేవ్ జీ, రాజారెడ్డి మాతోనే ఉన్నారు: ‘వికాల్ప్’ పేరుతో ప్రకటన

బలగం టీవీ, హైదరాబాద్‍:

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ సంచలన లేఖను విడుదల చేసింది. ఈ ఎన్‌కౌంటర్ ముమ్మాటికీ బూటకపు కథనమే అని ఆ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) ప్రతినిధి వికాల్ప్ పేరుతో విడుదల చేసిన లేఖలో స్పష్టం చేసింది.

అనారోగ్యంతో చికిత్స నిమిత్తం విజయవాడ వచ్చిన హిడ్మాను కలప వ్యాపారులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సజీవంగా పట్టుకున్నారు. మారేడుమిల్లిలో జరిగినట్లు పోలీసులు చెప్తున్న ఎన్‌కౌంటర్ పూర్తిగా అవాస్తవం. హిడ్మా గురించి అగ్రనేత దేవ్ జీ సమాచారం ఇచ్చాడని పోలీసులు చేస్తున్న ప్రచారం నిజం కాదు. దేవ్ జీ, రాజారెడ్డి సహా ఇతర అగ్రనేతలు తమ పార్టీలోనే సురక్షితంగా ఉన్నారని వికాల్ప్ ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here