బలగం టీవీ, హైదరాబాద్:
భారత్‌లో రిపబ్లిక్ ఆఫ్ ఘనా హైకమిషనర్ ప్రొఫెసర్ క్వాసి ఒబిరి-డాన్సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చారు.
ఈ భేటీలో పరస్పర సహకారం, సుహృద్భావ సంబంధాలపై చర్చించారు. ఘనా, తెలంగాణ మధ్య సంబంధాలు కొనసాగాలని హైకమిషనర్ అభిలషించారు. ప్రధానంగా విద్య, శాస్త్ర సాంకేతిక, ఆరోగ్య, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారం ఉండాలని కోరగా, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

