బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
పాక్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం
ఎల్లారెడ్డిపేట్ మండల కేంద్రంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాకిస్తాన్ తీవ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. కాశ్మీర్‌లోని పహల్గాంలో విహారయాత్రకు వెళ్లిన వారిని మతం పేరుతో విభజించి, ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుని హతమార్చిన ఉగ్రవాదుల చర్యను ప్రపంచం ఖండిస్తోందని హిందూ ఉత్సవ సమితి పేర్కొంది. చిప్ప పట్టుకుని ప్రపంచమంతా తిరుగుతున్న పాకిస్తాన్ ఈ దుశ్చర్యకు పాల్పడటం సిగ్గుచేటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం దీనికి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. ఈ ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు హిందూ ఉత్సవ సమితి సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితికి చెందిన పలువురు సభ్యులు పాల్గొన్నారు.
