ఇల్లంతకుంట మండల ఉమ్మడి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాలు..

0
176

బలగం టీవీ, ఇల్లంతకుంట:

ఇల్లంతకుంట మండల ఉమ్మడి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రంగుల పండుగ హోలీ సంబరాలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించబడినవి. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొని పరస్పరం రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. హోలీ పండుగ సామరస్యానికి, స్నేహభావానికి ప్రతీక అని, సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని అన్నారు. పాత్రికేయులు సమాజానికి అద్దంలాంటి వారు అని, ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు.

ఇల్లంతకుంట మండల ఉమ్మడి ప్రెస్ క్లబ్ తరఫున మండల ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజంలో సఖ్యత, శాంతి, ఐక్యత నెలకొనాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here